Podcast on Chakravarthy - Draft Script
నమస్కారం, నేను అరుణ్ – నేను చేసే పాటలపెట్టి (పాటలు ఉన్న డ్కాస్ట్ కి నే పెట్టిన ముద్దు పేరు) – కొత్త ఎపిసోడ్ కి స్వాగతం - సినిమా హిట్ కావడానికి ఆకట్టుకునే సంగీతం పాత్ర ఎక్కువే అన్నది నిర్వివాదాంశం – సినిమా బావున్నా కలెక్షన్ రేంజ్ నిర్ణయించేది రిపీట్ views – ఈ రిపీట్ views కి కారణాల్లో సంగీతానిది ముఖ్య పాత్ర. అలా సినిమా రేంజ్ ని పెంచడానికి కారణ భూతుల్లో సంగీత దర్శకులు చక్రవర్తి గారి పేరు తప్పకుండా ఉంటుంది. ఈ రోజు చక్రవర్తి గారి పుట్టినరోజు , ఈ సందర్భంగా ఆయనకి నివాళి గా నాకు అనిపించిన కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను. అయితే ఇది ఆయన biography కాదు – కేవలం నాకు అనిపించినా విషయాలు. తెలుగు సినిమా పాటకి మాస్ – సరిగ్గా చెప్పాలంటే – ఊర మాస్ స్థాయి తెచ్చిన సంగీత దర్శకులు చక్రవర్తి గారు. ఒక సంవత్సరం లో 25 to maximum 40 సినిమాలు సంగీత దర్శకత్వం వహించిన వారు ఇంకొకరు లేరేమో ప్రపంచ సినీ చరిత్రలో. అంత వేగంగా బాణీలు కట్టేవారట, సరే! బాణీలు కట్టడం అంత కష్టమైన ప్రక్రియ కాదు అనేయవచ్చు, కానీ, మెప్పించాల్సిన వారు కె ఎస్ ప్రకాష్ రావు, దాసరి, రాఘవేంద్రరావు, వి మధుసూధనరావ్ , k s r dass , క...