Podcast on Chakravarthy - Draft Script

 

నమస్కారం, నేను అరుణ్ – నేను చేసే పాటలపెట్టి (పాటలు ఉన్న డ్కాస్ట్ కి నే పెట్టిన ముద్దు పేరు) – కొత్త ఎపిసోడ్ కి స్వాగతం - 

సినిమా హిట్ కావడానికి ఆకట్టుకునే సంగీతం పాత్ర ఎక్కువే అన్నది నిర్వివాదాంశం – సినిమా బావున్నా కలెక్షన్ రేంజ్ నిర్ణయించేది రిపీట్ views – ఈ రిపీట్ views కి కారణాల్లో సంగీతానిది ముఖ్య పాత్ర. అలా సినిమా రేంజ్ ని పెంచడానికి కారణ భూతుల్లో సంగీత దర్శకులు చక్రవర్తి గారి పేరు తప్పకుండా ఉంటుంది.
ఈ రోజు చక్రవర్తి గారి పుట్టినరోజు , ఈ సందర్భంగా ఆయనకి నివాళి గా నాకు అనిపించిన కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను. అయితే ఇది ఆయన
biography కాదు – కేవలం నాకు అనిపించినా విషయాలు.

తెలుగు సినిమా పాటకి మాస్ – సరిగ్గా చెప్పాలంటే – ఊర మాస్ స్థాయి తెచ్చిన సంగీత దర్శకులు చక్రవర్తి గారు.

ఒక సంవత్సరం లో 25 to maximum 40 సినిమాలు సంగీత దర్శకత్వం వహించిన వారు ఇంకొకరు లేరేమో ప్రపంచ సినీ చరిత్రలో. అంత వేగంగా బాణీలు కట్టేవారట, సరే! బాణీలు కట్టడం అంత కష్టమైన ప్రక్రియ కాదు అనేయవచ్చు, కానీ, మెప్పించాల్సిన వారు కె ఎస్ ప్రకాష్ రావు, దాసరి, రాఘవేంద్రరావు, వి మధుసూధనరావ్ , k s r dass, కోదండ రామి రెడ్డి , కోడి రామకృష్ణ  .. లాంటి సంగీతం లో మంచి అభిరుచి ఉన్న అగ్ర దర్శకులు. ఇది సులువైన విషయమే కాదు.

 

గడిచిపోయిన కాలంలో, - ఒక సినిమా పాట జీవిత పరిమాణం –  

·        హాల్ లో సీట్ లో కూర్చోపెట్టించ గలిగే అంత సమయం తో మొదలయ్యి,
బైట పాడుకో గలగడం,
రేడియొలో ఎక్కువ సార్లు రావడం – అవే ఆ కాలంలో
views/ప్లేస్ 
cassetlu, రేకార్డులు కొనడం – రెకార్డింగ్ సెంటర్లలో ఎక్కువ ప్లే చేసేవారు

·        పూజ మండపాలు, ఉత్సవాలు, తీర్ధయాలు , రికార్డింగ్ danculu

·        ఇంకొ  స్థాయి పెరిగింది అంతే – పాటల పోటీలలో పాడడం

 

చక్రవర్తి గారు చేసిన పాటలు చాలా వరకు అన్నీ స్థాయిలు చెరినవే – తెలుగు నాట మారు మ్రోగిపోవడమే

అంతెందుకు – నా చిన్నప్పుడు – రేడియొ నే మా పాటల నేస్తం – ప్రతి రెండో పాట – “ఫలానా చిత్రం.. రచన వేటూరి, గానం బాలు సుశీల, సంగీతం చక్రవర్తి “ అని వినడం  చాలా చాలా common

 

అయితే చక్రవర్తి గారు కేవలం మాస్ , దంపుడు, క్లబ్ పాటలే చేశారు అని చాలా మంది అనుకుంటారు. 

ఆయన రాగా యుక్తమైన , మెలోడీ పాటలు చాలా చాలా చేశారు – ఆయన శకం లో ఉన్న మహదేవన్, సత్యం, రమేశ్ నాయుడు కి ఏమి తక్కువ తీసుపోకుండా చాలా మంచి పాటలు చేశారు. కొన్ని పాటలు చెప్తే కొంత మంది ఆశ్చర్య పోవచ్చు – అరే ! ఇది చక్రవర్తి గారు చేసారా అని

·        కుశలమా నీకు కుశలమేనా

·        కేరటానికి ఆరాటం తీరం చేరాలని

·        పువ్వులనడుగు నవ్వులనడుగు

·        చిన్న మాటా ఒక చిన్న మాటా

·        సిరిమల్లె పువల్లే నవ్వు

·        గోరువెచ్చని సూరీడమ్మా

·        ఇది మేఘ సందేశమూ అనురాగ సాంకేతమో

·        పంట చేలో పాళా కంకి నవ్వింది

·        తారలు దిగి వచ్చిన వేళా

·        గోరింక కూసింది, గోరింట పండింది

·        మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి

·        నీ తీయని పెదవులు అందకపోతే నిదురే రాదమ్మా

·        ఆకాశమా నీవెక్కడ అవని పైనున్న నేనెక్కడ

·        ఇంకా మరెన్నో

 

మరి మాస్ పాటల్లో మాధుర్యం ఏమైనా తగ్గించార అంతే అది కాదు , ఒక ప్రత్యేకమయిన orchestration తో, ఒరిజినల్ instruments , electronic instruments, ఊపందించే tolu section (అదేనండీ percussion లేదా డ్రమ్ section తో) పాటలు గమ్మత్తుగా చేశారు –

·        శారద నిను చేరగా

·        హే చూసాను పొద్దంత ..

·        వాళ్ళంతా వేయారమే ఓ చిన్నదాన

·        దిక్కులు చూడకు రామయ్య – చరణాలు

·        పువ్వులనదుగు నవ్వులనడుగు

·        చిలక కొట్టుడు కొడితే

·        ఆకు చాటు పిందె తడిసె

·        తెల్ల చీర మల్లె పూలు కళ్ల కాటుకా ఎర్ర బొట్టు

·        కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా

·        ఏల్లువొచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డా దమ్మో

·        వానా వానా వందనం

·        ప్రియతమ లాలనా గోరింటాకు పొదుల్లోనా

·        కాశ్మీరు లోయలో కన్యా కుమారి రో ఓ చందా మామ

·        చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి

 

చక్రవర్తి గారు అన్నీ రకాల పాటలు చేశారురాగాల ఆధారంగా చేసిన పాటలు చాలా ఉన్నాయి, మోహన, శివరంజని, రేవతి, శంకరాభరణం, పున్నగవరాళి, సింధుభైరవి, భీంపలాస్, ఆలాగే రాగమాలికలు (చీకటి వెలుగుల కౌగిటిలో)

·        డాన్స్ బేస్డ్ - ఆడవే అందాల సురభామిని

·        హరికధ – మహానగరం లో మాయగాడు

·        స్టేజ్ ప్లే  – వేదం నాదం మోదం మోక్షం,

·        ఫోల్క్ – నాంపల్లి టేషన్ కాడి రాజ లింగో

 

·        క్లబ్/డిస్కో – తెలుగు సినిమాలో ఎక్కువ డిస్కో పాటలు చేసిన వారు ఈయనే అసలు ఈ సెక్షన్ మీదే ఒక పాడ్కాస్ట్ చేయవచ్చు

o   నీ ఇల్లు బంగారం కాను , అగ్గి పుల్ల భగ్గు మంటాది  , ఒక లైలా కోసం తిరిగాను దేశం , రగులుతోంది మొగలి పోదా

o   గోలిమార్ గోలిమార్  కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావు , మెరుపులా లా లా

·        Melancholy – యాతమేసి తొడినా, మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా , ఈ దుర్యోధన దూష్యశాన దుర్వినీత లోకం లో , చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరం లో

 

చక్రవర్తి గారి రాగశాల – సంగీత దర్శకుల పాఠశాల – ఆయన తరవాత తరం లో వచ్చిన రాజ్ కోటి, కీరవాణి, వందేమాత్రం శ్రీనివాస్,  మణిశర్మ, ఏ ఆర్ రహమాన్ , హ్యారిస్ జేయరాజ్, కృష్ణ చక్ర,  పరోక్షంగా ఎస్ వి కృష్ణ రెడ్డి

 

చక్రవర్తి గారు 20 సంవత్సరాలు సంగీత చక్రవర్తి గా సామ్రాజ్యాన్ని ఏలారు అన్నది నిర్వివాదాంశం


https://youtu.be/QrdxX9dGstY

 

Comments

Popular posts from this blog

పాడుదాం భారత గీతి

రాగమయీ రావే - జయభేరి - పెండ్యాల నాగేశ్వర రావు - మల్లాది రామకృష్ణ శాస్త్రి - ఘంటసాల