Posts

Showing posts from May, 2025

గంగావతరణం | సిరివెన్నెల సీతారామ శాస్త్రి  | రసవాహినీ స్వాగతం

  నాకలోకమది నీ... పుట్టిన ఇల్లు నాగభూషణుడు చేపట్టినవాడు లోకపావనీ... మందాకినీ రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం సరస హృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం ఆఘమీభువి నిదాఘమై... అర్కద్యుతి ఆమోఘమై(2) సకలజగతి దాహతప్త సంక్షోభితమైననాడు దివివారిని భువిసీమకు తరలించగ దలచినట్టి భగీరథుని నిరీక్షణకు... దీర్ఘ తపస్సమీక్షణకు భగీరథుని నిరీక్షణకు... దీర్ఘ తపస్సమీక్షణకు విరూపాక్ష కరుణా సంప్రోక్షణమీ రసవాహిని జీవరసధునీ స్వాగతం... రసవాహినీ స్వాగతం నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా యుగయుగాల నిరీక్షణే నివాళికాగా నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా యుగయుగాల నిరీక్షణే నివాళికాగా ప్రాంజలి ఘటియించి తనదు, ప్రాంగణమున నిలిచినట్టి పిపాసార్త జగతికొరకు నిఠలాక్షు ఝటాఝుటి వియద్వాటి వీచెనది నిఠలాక్షు ఝటాఝుటి వియద్వాటి వీచెనదీ గంగాకన్నియ గుండెలునిండిన రంగోత్తుంగ తరంగమోదమది గంగాకన్నియ గుండెలునిండిన రంగోత్తుంగ తరంగమోదమది నింగినితాకగ పొంగులువారిన వినూత్న వినోద విలాస లాస్యము. ప్రళయాభీల తరంగితలీల భయంకరహేళ శివంకరుమ్రోల లయించగచేరగ అలలై కలలై వడిగా జడిగా పిడుగుల అడ...