Posts

Showing posts from October, 2022

పాండురంగ నామం

  పాండురంగ నామం పరమ పుణ్య ధామం ||2|| పాండురంగ నామం అదే మోక్ష తీరం వేద సారం మధురం మధురం పాండురంగ నామం పరమ పుణ్య ధామం పాండురంగ నామం ఎంత పాడుకున్న అంతులేని కావ్యం ||2|| ఎన్ని మార్లు విన్నా, నవ్యాతి   నవ్యం.. పాండురంగ నామం పరమ పుణ్య ధామం పాండురంగ నామం   పాండురంగ సన్నిది మాసిపోని పెన్నిధి ||2|| ప్రభు కరుణ లేనిది, జగతినేమి ఉన్నది పాండురంగ నామం పరమ పుణ్య ధామం పాండురంగ నామం   దాసులైన వారికి దాసుడీ తుకారాం ||2|| ధన్య జీవులార అందుకోండి రాం రాం పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి ||5||