పాడుదాం భారత గీతి
రచన & సంగీతం
: చింతలపాటి మూర్తి
పల్లవి: పాడుదాం భారత గీతి
కలసి చాటుదాం భారత
కీర్తి
అనుపల్లవి: మాతృభూమి కీర్తనతో
మదినిండా సుధ పొంగగా
మన గళాల ఘర్జనతో
విద్రోహుల గుండెలదర
పాడుదాం భారత గీతి
చరణం: పలుభాషలు పలుమతాలు పవిత్రత్రకు చిహ్నాలు
సహృదయత సౌభ్రాత్రత సామరస్య భావనలు
ఒక మూలన చితి రగిలిన,
ఒక పార్శ్వం భగ్గు మన్న (2)
స్వజాతీయ స్వార్ధాలకు రాజకీయ కుటిలనీతి
ఎంతో కాలం కాదని, అంతం అదిగో కలదని చాటుదాం
పాడుదాం భారత గీతి
చరణం: వేద భూమి, కర్మ భూమి, వేద భూమి,
కర్మ భూమి
పుణ్య భూమి మన ధాత్రి
విశ్వమంత వినుతించే,
వీర మాత మన భారతి
అహింసయే ఆదర్శం,
శాంతితోనే సాహచర్యం
భారతజాతి సందేశం,
విశ్వానికే ఆదర్శమని చాటుదాం
పాడుదాం భారత గీతి
చరణం: కన్నతల్లి, జన్మభూమి, స్వర్గం కన్నా మిన్నని
భారతి బిడ్డగా బ్రతుకుట,
ప్రతి జన్మకు కలగాలని
భారత మాత సేవ కొరకు
బ్రతుకంతా అంకితమని
ప్రాణాలు, తృణాలు
చేసిన మహనీయులు ఎందరో
ఆ బిడ్డల దీక్ష చూసి
భారతి మాది పొంగునటుల చాటుదాం
పాడుదాం భారత గీతి
Comments
Post a Comment