రాగమయీ రావే - జయభేరి - పెండ్యాల నాగేశ్వర రావు - మల్లాది రామకృష్ణ శాస్త్రి - ఘంటసాల

 పల్లవి :

రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...


అనుపల్లవి :
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీ చిరునవ్వుల కలకలలాడగ
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...


చరణం : 1
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
^^తనువై మనసై నెలరాయనితో
కలువలు కులికే సరసాలు నీవే^^
సరసాలు __> నీవే సరాగాలు నేనే
రా...గమయీ రావే అనురాగమయీ రావే
రా..గమయీ రావే...


చరణం : 2
సంజెలలో .... సంజెలలో హాయిగ సాగే చల్లనిగాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు

(interlude)
^^జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన .. . ఆ ఆ .. ఆ ఆ (4bars)
జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన <interlude> 
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను
నవ పరిమళమే నీవు
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ


చరణం : 3
నీడజూసి నీవనుకొని పులకరింతునే
అలవికాని మమతలతో కలువరింతునే
నీ కోసమే ఆవేదన....... నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే
నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ

Comments

Popular posts from this blog

పాడుదాం భారత గీతి

Podcast on Chakravarthy - Draft Script