ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు - మల్లేశ్వరి - దేవులపల్లి - సాలూరి రాజేశ్వర రావు - భానుమతి ఘంటసాల
(prelude)
ఆమె : ఆకాశ వీధిలో ..హాయిగా ఎగిరే..వు
దేశ దేశాల.న్ని తిరిగి చూసేవు....
ఏడ తానున్నాడో బావా (2)
జాడ తెలిసిన పోయిరావ ఆ...
అందాల ఓ మేఘమాల ఆ...చందాల ఓ మేఘమాల
(interlude)
అతడు : గగన సీమల తేలు ఓ మేఘమాల... ఆ ...
మాఊరు గుడిపై..న మసలి వస్తున్నా...వా... ఆ ...
మల్లి మాటేదైన నాతో....
మనసు,, చల్లగా చెప్పిపోవా
ఆ... నీలాల ఓ మేఘమాల..ఆ....రాగాల మేఘమాల
ఆమె: మమత లెరిగిన మేఘమాల ఆ_ _ _
మమత లెరిగిన మేఘమాల
నా.. మనసు బావకు చెప్పి రావా....
ఎన్నాళ్ళు నాకళ్ళు దిగులుతో రేపవలు (2)
ఎదురు తెన్నులు చూచెనే^
బావకై (v) చెదిరి కాయలు కాచెనే (vib) ఏ ఏ ఏ
నీలాల ఓ మేఘమాల..aa..aa రాగాల ఓ మేఘమాల
(హంసనంది)
అతడు : మనసు తెలిసిన మేఘమాల.aa.aa.aa
__మరువలేనని చెప్పలేవా..
మల్లితో.. మరువలేననీ చెప్పలేవా
కళ్ళు తెరచినగాని కళ్ళు మూసిన గాని (2)
మల్లి రూపె నిలిచేనే
నా .చెంత మల్లి మాటే పిలిచేనే
ఆమె: జాలిగుండెల మేఘమాల....బావ లేనది బ్రతుకజాలా..aaa (2)
_కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసిపోవా^^.. ..కన్నీరు... ఆనవాలుగ బావమ్రోల^^
Comments
Post a Comment