Oka manasutoh oka manasuki - Keervani - Chandrabose - Keeravani/Ganga
పల్లవి:
ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ
ప్రేమా ఆ ఆ ఆ ఆ ఆ
ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావూ
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ
ప్రేమా ఆ ఆ ఆ ఆ ఆ
చరణం 1:
పసి పాపలో ముసినవ్వు లా కపటాలు లేని ప్రేమా
మునిమాపులో మరుమల్లె లా మలినాలు లేని ప్రేమా
అరచేతిలో నెలవంక లా తెరచాటులేని ప్రేమా
నదిగొంతులో అలపాటలా తడబాటులేని ప్రేమా
మనసుల కలివిడి ఫలితం ప్రేమ ..... తనువుల తాకిడి కాదు సుమా
అనంత జీవ యాత్రలోన తోడు ప్రేమా
ప్రేమా ఆ ఆ ఆ ఆ ఆ ......
చరణం 2:
అధరాలలో తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమా
హృదయాలలో ధృవతారలా అలరారుతుంది ప్రేమా
పరువాలతో కరచాలనం చేసేది కాదు ప్రేమా
ప్రాణాలలో స్థిరబంధనం నెలకొల్పుతుంది ప్రేమా
మమతల అమృత వర్షిణి ప్రేమ ..... కోర్కెల అలజడి కాదు సుమా
నిశీధిలోనూ వీడిపోని నీడ ప్రేమా
ప్రేమా ఆ ఆ ఆ ఆ ఆ......
Comments
Post a Comment